ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ ఇది. విజువల్ వండర్‌లా, అద్బుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర హైలైట్‌గా వుంటుంది. అందరూ ఫ్యామిలీతో చూడదగ్గ డివోషనల్ థ్రిల్లర్ ఇది. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బసూర్ ఈ చిత్రానికి స్టనింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఓ వండర్‌ఫుల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది* అన్నారు.