ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల నుంచి అర్చన అయ్యర్ లుక్

దేవి

శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (16:59 IST)
Archana Iyer
విమర్శకుల ప్రశంసలు పొందిన కృష్ణమ్మ చిత్రంలో తన పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు అర్చన అయ్యర్. ప్రస్తుతం అర్చన అయ్యర్ సూపర్‌ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్‌’లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మేకర్లు ఈ చిత్రంలోని ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ వస్తున్నారు. ఆది సాయికుమార్‌, స్వాసిక పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అర్చన అయ్యర్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
 
దేవీ పాత్రలో అర్చన అయ్యర్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అర్చన ఎరుపు చీరలో కనిపిస్తోంది. ఇంటెన్స్ ఎమోషన్స్‌ను పలికిస్తూ కనిపించింది. బ్యాక్ గ్రౌండ్‌లో పంట, గుడి, పక్షులు, దిష్టిబొమ్మ ఇలా అన్నీ కూడా చాలా క్యూరియాసిటీని పెంచేలా ఉన్నాయి. పోస్టర్లతోనే అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది చిత్రయూనిట్. 
 
యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ జియో సైంటిస్ట్ పాత్రను పోషిస్తున్నారు.
 
అత్యున్నత నిర్మాణం, సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ చిత్రం ఉండబోతోంది. ప్రత్యేకమైన కథ, గ్రిప్పింగ్ కథనం, హై స్టాండర్డ్స్ వీఎఫ్ఎక్స్‌తో ఆడియెన్స్‌కు గొప్ప అనుభూతిని అందించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ(ఆర్‌ఎఫ్‌సి)లో జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు