నందమూరి హీరో బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విజయవంతం కావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య అభిమాని, యువ రచయిత్రి వేమూరుకు చెందిన అభిలాష రచించి, దర్శకత్వం వహించిన శత చిత్ర తార, తారక రామ పుత్ర బాలకృష్ణ వీడియో సాంగ్ అంతర్జాలంలో హల్‌చల్ చేస్తుంది.
గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర నిర్మాణం సమయంలో సెట్‌లో ఆయనను కలుసుకున్నాను. చిత్ర దర్శకుడు క్రిష్‌ను, యూనిట్ సభ్యులను బాలకృష్ణ పరిచయం చేశారు. ఈ సందర్భంలో బాలకృష్ణకు ఎన్ బీకే అక్షరాలతో చేసిన ఆభరణం బహుమతిగా ఇచ్చాను. మాటల రచయితగా రాణిస్తావని బాలకృష్ణ అభినందించారని ఆమె చెప్పుకొచ్చారు.