ది ఢిల్లీ ఫైల్స్ పేరుతో అభిషేక్ అగర్వాల్ చిత్రం

డీవీ

గురువారం, 25 ఏప్రియల్ 2024 (13:18 IST)
Abhishek Aggarwal
'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రితో కలిసి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 'ది ఢిల్లీ ఫైల్స్' కోసం జతకట్టనుంది. ఇప్పటికే మోడీకి అనుకూలంగా  కథలు వస్తున్నాయి. ఢిల్లీ లో జరిగిన తాజా పరిణామాలు సినిమాగా తీయనున్నట్లు తెలుస్తోంది. 
 
తాజాగా దర్శకుడు, నిర్మాత ఒక అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు.  ది ఢిల్లీ ఫైల్స్ ఈ సంవత్సరం సెట్స్‌పైకి వెళ్తుందని, వచ్చే ఏడాది విడుదలౌతుందని వివేక్ అగ్నిహోత్రి ధృవీకరించారు.
 
'షెడ్యూల్ ప్రకారం #TheDelhiFiles ఈ సంవత్సరం ప్రారంభమౌతుంది. వచ్చే ఏడాది విడుదల. బిగ్ స్టార్లు లేరు. బిగ్ కంటెంట్ మాత్రమే” అని వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు. దర్శకుడి స్టేట్మెంట్ పై అభిషేక్ అగర్వాల్ కూడా చిత్రం టైటిల్‌ను ట్యాగ్ చేయడం ద్వారా కన్ఫర్మ్ చేశారు  
 
తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, ఐ యామ్‌ బుద్ధ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్, అర్చన అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి పల్లవి జోషి నిర్మాతలు.  
 
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు