టైగర్ నాగేశ్వరరావుకు కోర్టు నుంచి లైన్ క్లియర్
బుధవారం, 18 అక్టోబరు 2023 (16:02 IST)
Tiger nageswrao
రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాపై స్టువర్ట్‌పురంలోని కొందరు కోర్టులో కేసు వేశారు. ఆ సినిమా మమ్మల్ని కించపరిచేవిధంగా తీశారంటూ ఇప్పటి తరానికి చెందిన వారు కేసు వేయగా హైదరాబాద్‌లోని కోర్టు నుంచి ఊరట లభించిందని చిత్రనిర్మాత అభిషేక్ అగర్వాల్ తెలియజేశారు. ఈరోజు ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తూ, మాకు కొద్దిరోజులుగా టెన్షన్ పెట్టిన విషయం క్లియర్ కావడం చాలాఆనందంగా వుందని పేర్కొన్నారు. సెన్సార్ వారు కూడా క్లియర్ ఇచ్చిన కొంత మంది కావలి చేసిన వారికి తగిన సమాధానం వచ్చిందని అన్నారు.
ఇక సినిమాపై తనకు పూర్తి నమ్మకం వుందని తెలిపారు. టైగర్ నాగేశ్వరరావు ఓ దొంగ మాత్రమేకాదు. ఆయన సినిమాను ఎందుకు తీశామనేది సినిమా చూశాక మీరే చెబుతారని అన్నారు. కార్తికేయ2, కాశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలు తీసిన మాకు మా బేనర్‌లో మరో ప్రతిష్టాత్మక సినిమా అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.