పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా మారుతున్నారు. ఆయన హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్1గా స్వాతి చంద్ర నిర్మించనున్నారు. సెప్టెంబర్ తొలివారంలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.