ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లాలో ఓ డాక్టర్ పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఓ నర్సు స్నానం చేస్తుంటే దొంగచాటుగా వీడియో తీశాడు. ఆపై కోర్కె తీర్చాలంటూ ఆమెను వేధించసాగాడు. పైగా, తన కోర్కె తీర్చలేదన్న అక్కసుతో ఆ వీడియోను ఆమె భర్తకు చూపించాడు. ఈ దారుణం రాంపూర్ జిల్లా షాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ హెల్త్ సెంటరులో పని చేసే ఓ నర్సు స్నానం చేస్తుండగా ఆ దృశ్యాలను రికార్డు చేసిన డాక్టర్ తన కోరిక తీర్చాలని ఆమెను బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. ఈ వీడియో క్లిప్‌ను డాక్టర్ తన భర్తకు చూపడంతో ఆయన తనకు విడాకులిచ్చాడని బాధితురాలు ఆరోపించింది.