టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం హైకోర్టు మధ్యంత బెయిల్ కాపీని జైలు సూపరింటెండ్‌కు అందజేయడంతో ఆ వెంటనే విడుదల ప్రక్రియను ప్రారంభించారు. అల్లు అర్జున్ న్యాయవాదులు రూ.50వేల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించారు. ఆ వెంటనే జైలు నుంచి విడుదల చేయగా.. అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలు వెనుక గేటు నుంచి పోలీసులు పంపించారు.