అక్కినేని నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేత (video)

సెల్వి

శనివారం, 24 ఆగస్టు 2024 (12:23 IST)
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథన్ అక్రమ నిర్మాణాలపై కీలక ప్రకటన చేశారు. చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన భవనాలన్నీ కూల్చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతను హైడ్రా అధికారులు ప్రారంభించారు. 
 
పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతను నిర్వహిస్తున్నారు. నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై కొద్ది రోజుల క్రితం హైడ్రాకు ఫిర్యాదు అందింది.
 
తుమ్మిడి చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నాగార్జున నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో విచారణ నిర్వహించిన అధికారులు అది ఆక్రమిత స్థలంగా తేల్చుకుని పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే కూల్చివేతకు ఉపక్రమించారు.
 

మాదాపూర్‌లో చెరువును కబ్జా చేసి నిర్మించారనే ఆరోపణల మీద @iamnagarjuna గారి N-CONVENTION సెంటర్ ను కూల్చేస్తున్నారు!

మరి, అనుమతులిచ్చిన అధికారులనూ & ఆ అధికారులను ఒత్తిడి చేసిన రాజకీయ నాయకులనూ శిక్షించరా? pic.twitter.com/woG00fU7hb

— వై.ఎస్.కాంత్ (@yskanth) August 24, 2024
హీరో నాగార్జున నల్ల ప్రీతమ్ రెడ్డితో కలిసి మాదాపూర్‌లో ఎన్3 ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్‌‌ను 2015లో నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ ఉంది. ఇందులో 1.12 ఎకరాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయి. 2 ఎకరాలు బఫర్ జోన్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు