మూడు పెళ్లిళ్లు చేసుకున్నా సంతోషం లేదు.. పవిత్ర విషయంలో?

సెల్వి

సోమవారం, 22 జనవరి 2024 (20:16 IST)
తనకు జరిగిన మూడు వివాహాల్లో తనకు సంతోషం కలగలేదని సీనియర్ నరేష్ అన్నారు. అందుకే పవిత్ర విషయంసో తాను ఒక నిర్ణయం తీసుకున్నానని.. అది వివాదానికి దారి తీసిందని నరేష్ చెప్పారు. పవిత్రతో తన జీవితం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. 
 
మిగిలిన జీవితాన్ని తాను, పవిత్ర ప్రశాంతంగా ముగించాలని అనుకుంటున్నామని చెప్పుకొచ్చారు. సీనియర్ నటీనటులు నరేశ్, పవిత్ర లోకేశ్‌ల ప్రేమ తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి దారి తీసింది. మూడో భార్యకు దూరమైన నరేష్ పవిత్రకు దగ్గరయ్యాడు. 
 
తన తొలి భర్తకు దూరమైన పవిత్రకు కూడా పిల్లలు ఉన్నారు. నరేశ్, పవిత్ర ఇద్దరూ దాదాపు ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే, నరేశ్‌కు విడాకులు ఇవ్వడానికి ఆయన మూడో భార్య రమ్య రఘుపతి అంగీకరించడం లేదు. 
 
ఇద్దరి మధ్య కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. దీంతో, ఇప్పటి వరకు నరేశ్, లోకేశ్ పెళ్లి చేసుకోలేదు. అయినప్పటికీ ఇద్దరూ కలిసి ఉంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు