సినీ నటుడు సినీ హీరో నరేష్ రాజకీయ పార్టీ మారనున్నారా? అయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ... సినీనటుడు పవన్ కళ్యాణ్ అనంతపూర్ అభివృద్ధి కోసం ఎంపిక చేసుకోవడం స్వాగతిస్తున్నాను. నటుడిగా, రాజకీయనాయకుడిగా ఆయన చేస్తున్న సేవలు ప్రశంసించాను. పౌరుడిగా నా బాధ్యతగా నేను అలా చెప్పానంతే. అలా అని నేను జనసేన పార్టీలో చేరతానని చెప్పలేదు..
నేను మొదటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కార్యకర్తగా వుంటూ.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాను. ఏది ఏమైనా... ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన ప్రాంతీయ పార్టీ రావాల్సిన అవసరం వుంది. ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పలేను.. నా సపోర్ట్ పవన్ కళ్యాణ్‌కే అని అని సినీ హీరో నరేష్ అన్నారు.