సుమ-రాజీవ్ కనకాల పరస్పర అంగీకారంతో ఏడాదిన్నర క్రితమే విడాకులు తీసుకున్నారని.. మూడేళ్ల ముందు నుంచే విడివిడిగా ఉంటున్నారంటూ వచ్చిన వార్తలకు బలం చేకూరుతుంది. యాంకర్ సుమ-రాజీవ్ కనకాల ఇంట్లో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2018లో రాజీవ్ కనకాల తల్లి, 2019లో తండ్రి దేవదాస్ కనకాల.. తాజాగా రాజీవ్ సోదరి శ్రీలక్ష్మి మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.
అయితే కనకాల కుటుంబానికి కోడలిగా సుమ.. తన బాధ్యతను నెరవేరుస్తూ ఉత్తర క్రియలను జరిపించింది. అయితే రాజీవ్ కనకాలతో సుమ వేరుపడి సుమారు నాలుగేళ్లు పైనే అయ్యిందని.. ఆయనతో దూరమైన ఆ కుటుంబంతో బంధాన్ని తెంచుకోలేదని అందుకే తన మామ, అత్త, వదినలు చనిపోయినప్పుడు కూడా కోడలిగా తన బాధ్యత నిర్వర్తించేందుకు సుమ వచ్చినట్టు సమాచారం.
ఇప్పటికే యాంకర్ సుమ.. వేరుగా ఉంటుందని, రాజీవ్ కనకాల మణికొండలోని ఫ్లాట్‌లో వేరుగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరికీ కొడుకు, కూతురు ఉండటంతో.. వాళ్లను పై చదువుల కోసం అమెరికాకు పంపించిందట సుమ. అయితే వీరి మధ్య విభేదాల విషయంలో కాని, విడాకుల విషయంలో కూడా బయటపడకుండా.. ఇంటి గుట్టు బయట పెట్టుకుని ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండా గౌరవంగానే విడిపోయారట.
ఇటీవల పలు సందర్భాల్లో సైతం తన భార్య గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ‘‘ఆమె అద్భుతం.. టెలివిజన్‌లో స్టార్‌డమ్ అనేది ఇంపాజిబుల్ కాని అసాధ్యం అన్నది ఆమె సుసాధ్యం చేసుకుంది. రాజీవ్ కనకాల అని కాకుండా సుమ భర్త అని అంటే దానికి ఫీల్ కానని.. గర్వంగా ఉంటుందంటూ గొప్పగా చెప్పుకొచ్చారు’ రాజీవ్ కనకాల. మరి రాజీవ్ కనకాల-సుమలు తమ విడాకుల వార్తలపై స్పందిస్తారో లేదో తెలియాలంటే.. వేచిచూడాలి.