పరేషాన్, జార్జ్ రెడ్డి, పలాస 1978, మసూద వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి మెప్పించిన తిరువీర్ కొత్త చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం మల్టీపుల్ ప్రాజెక్ట్స్‌తో తిరువీర్ బిజీగా ఉన్నారు. మరిన్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో తిరువీర్ కొత్త సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై సాయి మహేష్ చందు, సాయి శశాంక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ విరాట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ద్రిష్టి తల్వార్ హీరోయిన్‌గా నటిస్తోంది.