సాటి హీరోయిన్లు చూస్తే ఈర్ష్య లేదు : అంజలి

గురువారం, 3 జూన్ 2021 (08:24 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు సాటి హీరోయిన్లను చూస్తే తనకు ఎలాంటి ఈర్ష్య లేదని, వారిని చూసి స్ఫూర్తి పొందుతానని సినీ నటి అంజలి వ్యాఖ్యానించింది. అలాగే, చిత్రసీమలో కథానాయికల మధ్య పోటీ ఉంటుందనే సిద్ధాంతాన్ని తాను విశ్వసించనని స్పష్టం చేసింది. అదేసమయంలో సాటి హీరోయిన్లను చూసి స్ఫూర్తిపొందుతానే తప్ప వారి పట్ల తనలో ఎలాంటి అసూయద్వేషాలుండవని తేల్చిచెప్పింది. 
 
నవతరం నాయికలతో పోటీవల్లే అంజలి అవకాశాల రేసులో వెనుకబడిపోయినట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలను అంజలి ఖండించిన అంజలి మాట్లాడుతూ, 'సినీపరిశ్రమలో అవకాశాల విషయంలో ప్రతిభ ఒక్కటే కొలమానంగా ఉంటుంది. ఇక్కడ ఎవరికి దక్కాల్సిన సినిమాలు వారినే వరిస్తాయి. ఇతరులు చేస్తోన్న మంచి పాత్రలు నాకు దక్కితే బాగుంటుందని ఆశపడటంలో అర్థంలేదన్నారు. 
 
పైగా, రాసిపెట్టుంటే తప్పకుండా ఆ అవకాశం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. నా సినీ ప్రయాణంలో అనుష్క, సమంతతో పాటు చాలా మంది నాయికలతో కలిసి నటించాను. వారిని నా స్నేహితులుగా భావించాను తప్పితే పోటీదారులుగా ఏనాడూ ఊహించలేదు. సీనియర్లతో పాటు నూతన హీరోయిన్ల నటనను చూస్తూ నాలోని తప్పుల్ని సరిదిద్దుకుంటా. నాయికల మధ్య పోటీ గురించి అడిగితే మౌనమే నా సమాధానంగా భావిస్తా' వివరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు