పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఎప్పుడు కనిపించినా కూడా రచ్చ చేస్తుంటారు పవన్ ఫ్యాన్స్. మొన్న ఏప్రిల్ 8న అకీరా బర్త్ డే రోజు అయితే ఏకంగా నేషనల్ వైడ్ ట్రెండ్ చేసారు అభిమానులు. ఇదే సమయంలో ఈయన ఎంట్రీపై కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. పవన్ సినిమాలు చేస్తున్నా.. రాజకీయాల్లో వుండటం వల్ల సినిమాలకు దూరమవుతాడనే బాధ అభిమానుల్లో వుంది.