పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఇందులో అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలలో నటించారు. ఈ ముగ్గురు అమ్మాయిల చుట్టూ కథ తిరుగుతుంది.
ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, హీరోయిన్ అంజలి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 'వకీల్ సాబ్' సినిమా తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు. ఇందులో తన పాత్ర గురించి దర్శకుడు వేణు శ్రీరామ్ గురించి చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యానని.. ఇలాంటి మంచి కథ కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది.
ఈ సినిమా తర్వాత తనకు అవకాశాలు మరింత పెరుగుతాయని నమ్మకంగా చెబుతోంది ఈ తెలుగమ్మాయి. ఈ సినిమాలో ఈ ముగ్గురు హీరోయిన్లతో పాటు శ్రుతి హాసన్ కూడా నటిస్తోంది. ఈమె క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్‌లో వస్తుంది. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా వకీల్ సాబ్ సినిమాను నిర్మిస్తున్నారు.