తన ఫోటోలను ఆన్‌లైన్‌లో పెట్టి రూ.40వేల వెలకట్టారని సినీ నటి అపూర్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును చేధించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడే అసలు సంగతి బయటపడింది. ఆన్‌లైన్ మాధ్యమంగా తెలుగు సినిమా మహిళా నటుల ఫొటోలు పెట్టి, వారితో గడిపేందుకు వెలకట్టిన చొక్కారపు గణేష్ అనే వ్యక్తి మాజీ ప్రిన్సిపాల్ అని తేలింది.
ఇక గణేష్ పెట్టిన పోస్టింగ్స్‌లో కేవలం హీరోయిన్ల ఫొటోలు మాత్రమే కాకుండా, కొంతమంది కాలేజీ అమ్మాయిల చిత్రాలు కూడా వున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా, అపూర్వ తనపై ఫిర్యాదు ఇచ్చిన విషయాన్ని గురించి తెలుసుకున్న గణేష్, ఆమె ఫోటోలను డిలీట్ చేశాడని వాటిని రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
కేవలం హీరోయిన్ల ఫొటోలు చూపించి, విటుల నుంచి ఆన్ లైన్ మాధ్యమంగా గణేష్ రూ. 2 లక్షల వరకూ వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. కాగా క్యాస్టింగ్ కౌచ్‌పై నటి శ్రీరెడ్డికి అపూర్వ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో వున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమె పలు ఇంటర్వ్యూలలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.