వారిద్దరికీ పుట్టిన కనక కూడా నటిగా తెలుగులో నటించింది. కానీ ఆమె డ్రెగ్ కు బానిస అయిందనీ, అమ్మ దేవిక ఏది చెబితే అది చేసేదని అందుకే తనను తండ్రిగా హక్కు కోసమే సంతకం తీసుకుని ఆస్తిని కాజేయాలని జూసిందని దేవదాస్ వ్యాఖ్యానించారు. ఆస్తికోసం తనను చంపడానికి కూడా ట్రై చేసిందని తెలిపారు. ఇక దేవిక చనిపోయింది 2002లో. అప్పటినుంచి దేవదాస్ ఒంటరిగా వుంటున్నాడట. చెన్నై లో పాత భవంతిలో వుంటున్న ఆయన పలు విషయాలు చెబుతూ, దేవిక తనను మోసకాడిగా క్రియేట్ చేసిందని బాధను వ్యక్తం చేశాడు.
తను వెండితెరపై నటేకాదు. నిజజీవితంలో పెద్ద నటి అని పేర్కొన్నాడు. 1967 టైంలో ఆమెతో ఓ సినిమా చేశాక నా దగ్గరకు వచ్చి కాళ్ళపై పడి పెండ్లిచేసుకోమని ఏడ్చింది. నేను ఆమెను ప్రేమించలేదు. మా అమ్మగారు ప్రోద్బలంతో వివాహమాడాను. మాది నార్త్ నుంచి వచ్చిన ఫ్యామిలీ అంటూ తమిళ నటీమణుల కంటే తెలుగు నటీమణులు పెద్ద వివాదాల్లో వున్నారంటూ తెలిపారు కూడా. విడాకుల కేస్ లో లాయర్ చెప్పిన అబద్దాలను ఆమె చెప్పి తన పరువు తీసిందని అలాంటి ఆమె గురించి నేనేమీ పెద్దగా మాట్లాడకూదనుకున్నాను. ఇప్పటికే తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వాల్సివచ్చిందని 80 ఏళ్ల దేవదాస్ పేర్కొన్నారు.