తెలుగులో 'ఆపరేషన్ దుర్యోధన' సిరీస్‌లలో ఐటమ్ సాంగ్స్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి', 'నమస్తే', 'బి.టెక్ లవ్ స్టోరీ', 'ఐదు' వంటి చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన వశిష్ట...అక్కడా అవకాశాలు అంతంత మాత్రంగానే వరించాయి.
దీంతో హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని వేడెక్కించినా ఫలితం లేకుండా పోయింది. ఇంక చేసేది లేక నీలి చిత్రాలను నమ్ముకుంది. నీలి చిత్రాల్లో నటిస్తూ.. ఆ వీడియోలను ఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి.. సబ్‌స్క్రిప్షన్ ఫీజు కింద రూ.2000 వసూలు చేస్తున్న గెహనా వశిష్ట అండ్ టీమ్‌ను తాజాగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... గెహానా వశిష్టకు సంబంధించిన సుమారు 87 నీలి చిత్రాలు ఆ వెబ్‌సైట్‌లో ఉన్నాయని, వాటిని చూసేందుకు వీక్షకుల నుంచి రూ.2000 ఫీజు వసూలు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఆమెను, ఆమెతో నీలి చిత్రాలను నిర్మిస్తున్నవారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది.