నితిన్‌తో లవ్వా...? నాకిప్పుడే తెలిసింది... మేఘా ఆకాష్

బుధవారం, 1 నవంబరు 2017 (16:24 IST)
ఏ హీరో, హీరోయిన్ అయినా కలిసి వరుసగా చిత్రాలు చేసారంటే చాలు వారి మధ్య ఎఫైర్ వున్నదంటూ గుసగుసలు సాగడం మామూలే. ఆమధ్య బాహుబలి చిత్రంలో నటించిన ప్రభాస్-అనుష్కలు ప్రేమలో పడిపోయారనీ, ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. కానీ వాటిని ప్రభాస్-అనుష్క ఖండించడంతో ఆగిపోయాయి. ఇప్పుడలాంటి రూమర్ ఒకటి 'లై' చిత్రంలో నటించిన మేఘా ఆకాష్, నితిన్ పైన తిరుగుతోంది. అదేంటయా అంటే... వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో పడిపోయారని. 
 
దీనిపై నితిన్ అయితే ఇంతవరకూ స్పందించలేదు కానీ మేఘా ఆకాష్ మాత్రం మాట్లాడింది. తను నితిన్ ప్రేమలో పడిపోయామంటూ వచ్చిన వార్తను చూసి నవ్వుకున్నానని తెలిపింది. తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదనీ కేవలం లై చిత్రంలో నటించినందుకే ఇలాంటి రూమర్ పుట్టించారంటూ ఆమె చెప్పింది. మొత్తమ్మీద కాస్త ఆలస్యంగానైనా మేఘా స్పందిచినందుకు ఇక వారిపై రూమర్లు పుట్టే అవకాశం లేదని చెప్పుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు