టాలీవుడ్ అంటే నాకు ఎప్పటికీ ప్రాణంతో సమానం : పూజా హెగ్డే

సోమవారం, 9 నవంబరు 2020 (09:25 IST)
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేమరి.. అన్నంపెట్టి, ఆదరించిన వారిని విమర్శించడం, ఆ తర్వాత అబ్బే.. నేనలా అనలేదు అంటూ వివరణ ఇచ్చుకోవడం సినీ సెలెబ్రిటీలకు ఓ అలవాటుగా మారిపోయింది. ఈ కోవలో తాజాగా ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే కూడా చేరిపోయింది. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు తెలుగు అభిమానులపై విమర్శలు గుప్పించింది. ముఖ్యంగా, తెలుగు ఆడియన్స్‌కు నడుముతో పాటు అంగాంగ ప్రదర్శన అంటేనే అమితమైన ఇష్టమంటూ వ్యాఖ్యానించింది. దాంతో పూజాపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆమె వివరణ ఇచ్చారు. తాను అనని మాటలను అన్నట్టుగా వక్రీకరించారని ఆరోపించారు. 
 
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 'నేను ఒక ఇంటర్వ్యూలో అనని మాటలను అన్నట్టుగా రాశారు. ఒక సందర్భానికి తగినట్టు అన్న మాటలను మరో సందర్భానికి తగినట్టుగా అన్వయిస్తున్నారు. అక్షరాన్ని మార్చగలరేమో కానీ అభిమానాన్ని కాదు. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే నాకు ఎప్పటికీ ప్రాణంతో సమానం. ఈ విషయం నా సినిమాలను అభిమానించేవారికి, నా అభిమానులకు తెలుసు. అయినప్పటికీ ఎలాంటి అపార్థాలకు చోటు ఉండకూడదనే మరోసారి చెబుతున్నా... నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఓసారి నా ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి' అంటూ తన ప్రకటనలో వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు