తెలుగులోని కుర్ర హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరు. "కుమార్ 21ఎఫ్" చిత్రంతో ఆమె టాలీవుడ్ వెండితెరకు పరిచయమైంది. ఎంతో క్యూట్ క్యూట్‌గా కనిపించే ఈ భామ.. ఇటీవలికాలంలో అందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అదేసమయంలో అటు అందాలు, ఇటు నటన కారణంగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అలాగే, తన ఫ్యాన్ ఫాలోయర్ల సంఖ్యను కూడా విపరీతంగా పెంచుకుంది.