నాకూ అలాంటి పరిస్థితి ఎదురైంది.. ఓ అమ్మాయి ఎంతగా బాధపడితే?: పూనమ్ కౌర్

ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (15:58 IST)
టాలీవుడ్‌లో కొత్త అమ్మాయిలపై జరుగుతోన్న వేధింపులపై సినీ పెద్దలను ప్రశ్నిస్తూ సంచలనంగా మారిన శ్రీరెడ్డికి మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. కాస్టింగ్ కౌచ్‌పై తాజాగా నటి పూనమ్ కౌర్ స్పందించింది. తనకూ ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పింది.
  

ఏదో అయిపోయిందని తానీ విషయం చెప్పలేదని.. సమయం అనుకూలంగా లేదని భావిస్తే.. ఎలా బయటపడాలో ఆలోచించాలని సూచించింది. పరిస్థితి తగ్గట్టు నడుచుకుంటానని.. తనకు ఓపిక చాలా అధికమని పూనమ్ వెల్లడించింది. 
 
అయితే ఎవ్వరికీ నష్టం కలిగించే మనస్తత్వం తనకు లేదని చెప్పింది. కానీ తన చుట్టూ ఏం జరుగుతుందో తనకు తెలుసునని... ఓ అమ్మాయి ఎంతగా బాధపడితే, తనకు జరిగిన అన్యాయాన్ని నలుగురిలో చెప్పుకునేందుకు ముందుకు వస్తుందో అర్థం చేసుకోవాలని పూనమ్ చెప్పింది. అయితే తాను బలహీనురాలిని కాదని స్పష్టం చేసింది. తాను చేయగలిగిందే చేస్తానని.. ధైర్యంగా ఎదురునిలబడే సత్తా తనకుందని పూనమ్ తెలిపింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు