హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

ఠాగూర్

మంగళవారం, 7 అక్టోబరు 2025 (19:54 IST)
కోలీవుడ్ అగ్రహీరో, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌పై హీరోయిన్ శృతిహాసన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయ్‌ను ఆమె ఓ జోకర్‌తో పోల్చారు. జోకర్ కావడం వల్లే సర్కస్‌కు వెళ్లాలంటూ కామెంట్స్ చేశారు. ఇటీవల కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట సంభవించింది. ఇందులో 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాట ఒక్క తమిళనాడులోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ తొక్కిసలాటపై అనేక మంది తమతమ సంతాపాలను వ్యక్తం చేశారు. 
 
అయితే, తమిళ చిత్రపరిశ్రమకు చెందిన కొందరు నటీనటులు మాత్రమే ఈ ఘటనపై స్పందించారు. ఇపుడు హీరోయిన్ శృతిహాసన్ స్పందించారు. విజయ్‌ను ఓ జోకర్‌గా పేర్కొన్నారు. ఓ జోకర్ సర్కస్‌కు పోవడం వల్లే ఈ ఘోరం జరిగిందన్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. దీనిని ఆమె ఫాలోయర్లు షేర్ చేయడంతో వైరల్ అయింది. పైగా, నెటిజన్లు సైతం శృతిహాసన్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు