పడక సుఖం ఇస్తే హీరోయిన్‌గా నిలదొక్కుకున్నట్టే : నటి తేజస్వి

శనివారం, 13 జూన్ 2020 (16:32 IST)
తెలుగు సినీ నటి తేజస్వి మరో బాంబు పేల్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా పలు సినీ ఇండస్ట్రీల్లో రాణిస్తున్న హీరోయిన్లకు చేదు అనుభవాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా, పడక సుఖానికి సమ్మతిస్తేనే సినీ అవకాశాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. 
 
తాజాగా ఆమె క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందిస్తూ, టాలీవుడ్‌లో 90 శాతం కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పుకొచ్చింది. కమిట్‌మెంట్‌కు ఓకే చెపితేనే అవకాశాలు వస్తాయని తెలిపింది. 
 
ఈ క్యాటగిరీలో ఉండేవాళ్లే ఇండస్ట్రీలో ముందుకు సాగుతారని చెప్పింది. ఇండస్ట్రీకి వస్తున్న వారు ముందుగానే దీనికి ప్రిపేరై వస్తున్నారని తెలిపింది. తనను కూడా చాలా మంది పడక గదికి రమ్మని పిలిచారని... దానికి తాను అంగీకరించక పోవడంవల్లే, సినీ పరిశ్రమలో సక్సెస్ కాలేకపోయానని చెప్పుకొచ్చింది. 
 
తనకు తెలిసిన హీరోయిన్లలో చాలా మందికి ఇలాంటి చేదు అనుభవాలే ఉన్నాయని తేజస్వి తెలిపింది. చాలా మంది తమ అనుభవాలను బయటకు చెప్పుకోరని వ్యాఖ్యానించింది. ముంబై నుంచి వచ్చే అమ్మాయిలు దేనికైనా ఒప్పుకుంటారని... ఈ ఒక్క కారణం వల్లే వారికి అవకాశాలు ఇస్తుంటారని చెప్పింది. 
 
ముంబై అమ్మాయిలు కమిట్ మెంట్లకు సిద్ధపడి ఇక్కడకు వస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది. కమిట్‌మెంట్‌కు రెడీ అంటే అవకాశాలు ఇచ్చే వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని చెప్పింది. తేజస్వి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు