తాజాగా ఓ దాడి కేసులో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలీకి ఒక యేడాది పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ అంధేరీ మెట్రోపాలిటన్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. అలాగే, రూ.20,000 జరిమానా విధించింది.
ఆదిత్యకు, అతడి అపార్ట్‌మెంట్‌లో నివసించే ఓ వ్యక్తికి కారు పార్కింగ్ స్థలం చిన్నపాటి గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ఆదిత్య.. ఆ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారించిన కోర్టు.. 12 యేళ్ల తర్వాత తుది తీర్పును వెలువరించింది.