బాల నటిగా సిపాయి కూతురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తరువాత, జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తన శాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు - బీముడు, భక్త ప్రహ్లాద వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఊర్రూతలూగించి ఎన్నో అద్భుతాలు సృష్టించిన అలనాటి అందాల తార ఎల్. విజయలక్ష్మి, 50 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీ కి దూరం గా ఉన్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో సుమారు15 సినిమాలకు పైగా తను నటించి సినీ ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచి పోయారు.