ఆర్ఆర్ఆర్ నటుడు ఎన్టీఆర్తో కలిసి పనిచేయడం ద్వారా తన కల నిజమైందని బాలీవుడ్ సుందరి, అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో, తాను చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్కి అభిమానిని అని చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలో రణబీర్ కపూర్ కలిసి నటించే అవకాశం వస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపింది. కాగా, రామ్ చరణ్ తదుపరి చిత్రంలో నటించేందుకు జాన్వీ చర్చలు జరుపుతోంది. అంతా సవ్యంగా జరిగితే, రామ్ చరణ్ - బుచ్చిబాబుల పేరులేని స్పోర్ట్స్ డ్రామా జాన్వీ కపూర్ రెండవ తెలుగు చిత్రం అవుతుందని సినీ పండితులు అంటున్నారు.