అజ్ఞాతవాసిలో పవన్-ఖుష్బూ పవర్ ఫుల్ లుక్ ఇదే (ఫోటో)

సోమవారం, 18 డిశెంబరు 2017 (07:37 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి టీజర్ విడుదలై రికార్డుల వేట ప్రారంభించింది.  త్రివిక్రమ్ మార్క్‌లో టీజర్ అదుర్స్ అంటూ అప్పుడే సినీ పండితులు జోస్యం చెప్పేశారు. ఈ టీజర్ రిలీజైన 30 నిమిషాల్లోనే పది లక్షలకు పైగా వ్యూస్‌తో పాట లక్షకు పైగా లైక్స్ సాధించింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో అజ్ఞాతవాసి నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. 
 
తద్వారా తెలుగులో అత్యధిక లైక్స్ సాధించిన టీజర్‌గా అజ్ఞాతవాసి రికార్డ్ సృష్టించింది. ఇక తాజాగా అజ్ఞాతవాసి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుథ్ స్వరాలందించారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న అజ్ఞాతవాసి సంక్రాంతి కానుకగా జనవరి 10న పేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రను ఖుష్బూ పోషిస్తున్నారు. తాజాగా పవన్‌తో ఖుష్బూ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లో ఖుష్బూ కుర్చీలో కూర్చుని వుండగా.. ఆమె వెనుక నిలబడి ఉన్న పవన్ కల్యాణ్ సీరియస్‌గా చూస్తూ కనిపిస్తున్నారు. సంవత్సరాల పాటు ఇలాంటి పాత్ర కోసం ఎదురుచూశానని, తనపై నమ్మకంతో ఆ పాత్రకు తనను ఎంపిక చేసిన దర్శకుడు త్రివిక్రమ్‌కు ధన్యవాదాలని, పవన్ కల్యాణ్ అద్భుతమైన వ్యక్తి అంటూ ఖుష్బూ ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు