పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఈనెల పదో తేదీన విడుదలైన చిత్రం "అజ్ఞాతవాసి". ఇందులో సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనున్నాడనే వార్త బాగా ప్రచారమైంది. సినిమా టైటిల్ కార్డ్స్‌లో కూడా వెంకీకి స్పెషల్ థ్యాంక్స్ ఉండటంతో రోల్ ఉంటుందని అంతా భావించారు. అయితే సినిమాలో మాత్రం ఆ మెరుపులు లేకుండా పోయాయి.
పవన్.. "గురువు గారు అంటే.. గారు అక్కర్లేదమ్మా గురూ చాలూ.." అని వెంకీ చెప్పటం… 'నాకు కొంచెం తిక్కుంది' అని పవన్ అంటే… 'దానికో లెక్కుంది' అని మళ్లీ వెంకీ చెప్పటం ఇలా సాగిపోయిన వీడియో ఫన్నీగా ఉంది. సంక్రాంతి నుంచి ఆ సీన్ సినిమాకి యాడ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాత ఎస్. రాధాకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్ తెలిపారు. ఆ వీడియోను మీరూ చూడండి.