అహల్య అందాలు అద్భుతం... రాధికా ఆప్టే నటన అదరహో.. అమితాబ్ ట్వీట్స్..

శుక్రవారం, 24 జులై 2015 (11:05 IST)
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించిన లఘు చిత్రం 'అహల్య' అద్భుతంగా ఉందని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కితాబిచ్చారు. షార్ట్ ఫిల్మ్‌లో సౌమిత్రా ఛటర్జీ, రాధికా అప్టే నటన అద్భుతమని ఆయన పేర్కొన్నారు. 'షార్ట్ ఫిల్మ్‌ల మ్యాజిక్ అంటే ఇదే, సుజోయ్ ఘోష్ అద్భుతం' అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, 14 నిమిషాల 10 సెకెన్ల నిడివి గలిగిన 'అహల్య' లఘుచిత్రం పురాణాలలో అహల్య పాత్ర కథావస్తువుగా రూపొందింది.
 
మిస్సింగ్ కేసు దర్యాప్తు నిమిత్తం ఓ ఇంటికెళ్లిన పోలీసు అధికారి, ఆ ఇంట్లోని మహిళను తప్పుడు దృష్టితో చూసి ప్రతిమగా మారిపోవడం కథ. దానిని సుజోయ్ ఘోష్ రూపొందించిన విధానానికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి