ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అందాల రాశి ఐశ్వర్యారాయ్ ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఐశ్వర్యరాయ్ మాత్రం సాధ్యమైనంత వరకు కామెంట్ చేయడాన్ని ఇష్టపడరు. కానీ ప్రధాని మోడీ నోట్ల రద్దు విషయమై తీసుకున్న నిర్ణయంపై ఐష్ స్పందించారు. ఓ సిటిజెన్‌గా మోడీ నల్లధనాన్ని నిర్మూలించడానికి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు.