కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

ఠాగూర్

సోమవారం, 14 జులై 2025 (14:08 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వివాహేతర సంబంధం నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ నేత ప్రాణం తీసింది. గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన సదరు నేత... చివరకు ఓ రిజర్వాయర్‌లో శవమై కనిపించాడు. జిల్లాలోని కల్వకోల్ గ్రామంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే,
 
కల్వకోల్ గ్రామానికి చెందిన కర్నాటి దామోదర్ గౌడ్ (48) అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నేత. ఈయన గత రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయారు. రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో దామోదర్ గౌడ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులుకు ఓ మృతదేహం సింగోటం రిజర్వాయర్‌లో కనిపించింది. దీంతో తొలుత అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. 
 
దామోదర్ గౌడ్‌కు అదేగ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆ మహిళతో గడిపేందుకు వెళ్లి, ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. ఆ సమయంలో సదరు మహిళ భర్త, కుమారుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, ఆగ్రహంతో చితకబాదడంతో దామోదర్ అక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత శవాన్ని సంచిలో మూటగట్టి తీసుకెళ్లి ఎంజీకేఎల్ కాల్వలో పడేశారు. ఈ కేసులో ఆ మహిళతో పాటు హత్య చేసిన ఆమె భర్త, కుమారుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు