నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ సినిమా అఖండ. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న విడుదలైన అఖండ మంచి వసూళ్లను రాబడుతోంది.
అంచనాలను మించి దుమ్ము లేపుతోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా డిసెంబర్ 17న విడులై.. అద్భుత కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. 13 రోజుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 138.72 కోట్ల నెట్, 244 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
ఈ నేపథ్యంలో పెళ్లి సందడి, అఖండ, పుష్ప సినిమాలు జనవరి నెలలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. అఖండ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. పుష్ప అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం తెలుస్తోంది.