Tuck jagadesh trailer meet
ఏ సినిమాలోనైనా తండ్రి సెంటిమెంటో, తల్లి సెంటిమెంటో, చెల్లి సెంటిమెంటో ఇలా ఒక్కోదానిపైనే సినిమా కథ వుంటుంది. కానీ టక్‌జగదీస్ ట్రైలర్ చూస్తే తల్లి, తండ్రి ఇద్దరి సెంటిమెంట్ కథగా వుందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నాని తగువిధంగా సమాధానమిచ్చారు. టక్ జగదీష్ మన ఇంటి సినిమా. అందుకే అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అన్నయ్య సెంటిమెంట్‌కూడా వుంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్‌ను విడుదలచేశారు. ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో నాని, రీతూ వర్మ, శివ నిర్వాణ, ప్రవీణ్, తిరువీర్, సాహు గారపాటి, హరీష్ పెద్ది పాల్గొన్నారు.