ఇక నా పార్టనర్ రవివర్మ సొంతంగా ఫైనాన్షియర్ శ్రీకాంత్ నుండి ఏపి ఫైబర్ నెట్ ప్రసారహక్కులను కొనుగోలు చేశారు. ఏపి ఫైబర్‌నెట్ రవివర్మనుండి ప్రసార హక్కులను రెండుకోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది. కానీ కోటి రూపాయలు మాత్రమే ఎకౌంట్‌కు వచ్చింది. ఇది శ్రీకాంత్, రవివర్మలకు సంబంధించిన ఒప్పందం.
తన బకాయి మొత్తం చెల్లించనందున నా పార్టనర్ రవివర్మ సివిల్ కోర్టులో కేసు పెట్టారు. అలాగే రవివర్మ పైన, నా పైన తప్పుగా ప్రచారం చేసి మా పరువుకు భంగం కలిగించిన కొన్ని టీవి ఛానల్స్ టీవి5, ఏబిఎన్, మహా టీవి మరియు కొన్ని ఛానల్స్‌పై నష్ట పరిహారం కోసం కేసులు పెడుతున్నాం అని వర్మ తెలిపారు.