పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై చిక్కడపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంసలో శుక్రవారం బన్నీని అరెస్ట్ చేసి పోలీసులు చిక్కడపల్లి పీఎస్‌కు తరలించారు. అయితే ఇది అరెస్ట్ కాదని, కేవలం విచారణకు మాత్రమే అల్లు అర్జున్‌ను పోలీసులు తీసుకెళ్లారని ఆయన పీఆర్ టీమ్ వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా స్నేహారెడ్డి బాధపడుతుంటే.. బన్నీ ధైర్యం చెప్తూ వెళ్లిపోయాడు.