కొన్ని సినిమాల గురించి ముందుగా అలా తెలిసిపోతుంటాయంతే. అలా పుష్ప సినిమా విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంచనా వేసిన ప్రతీ విషయం నిజమైపోతుందిప్పుడు. విడుదలకు ముందు నుంచే ఈ చిత్రంపై సూపర్ కాన్ఫిడెంట్‌గా కనిపించారు అల్లు అర్జున్. దర్శకుడు సుకుమార్ టేకింగ్ గురించి.. ఆయన సినిమా తెరకెక్కించిన విధానం గురించి ప్రీ రిలీజ్ టైమ్‌లోనే చెప్పారు. పుష్ప విడుదలయ్యాక ఇండియా అంతా షేక్ అయిపోతుందని అంచనా వేసారు బన్నీ. ఆయన నమ్మకం వమ్ము కాలేదు. పుష్ప రిలీజ్ తర్వాత ఎంతటి సంచలనాలు రేపిందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ సినిమా మేనరిజమ్స్ ఇండియాను ఊపేస్తాయని నమ్మకంగా చెప్పారు బన్నీ. సినిమాకు మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినపుడు కూడా ఫలితంపై నమ్మకంగానే ఉన్నారు బన్నీ. కచ్చితంగా ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే పుష్ప ఏకంగా 350 కోట్లు వసూలు చేసింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా పుష్ప తరహాలో తగ్గేదే లే అన్నారు.. ఇంకా అంటూనే ఉన్నారు. అంతేకాదు రాజకీయ నాయకులు సైతం పుష్ప మేనరిజమ్స్ వాడుకుంటూనే ఉన్నారు.