'ఖైదీ' మెగా ఈవెంట్‌లో అపశృతి.. 15 మందికి గాయాలు :: ప్రకృతే ఈ ప్లేస్‌ చూపించింది: అరవింద్‌

ఆదివారం, 8 జనవరి 2017 (11:54 IST)
"ఖైదీ నం.150" ప్రీరిలీజ్ మెగా ఈవెంట్‌లో అపశృతి చోటుచేసుకొంది. గుంటూరు వేదికగా జరిగిన ఈ వేడుకకి మెగా అభిమానులు పోటెత్తారు. ఫంక్షన్ చాలా సరదాగా సాగింది. మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మెగా యంగ్ హీరోలు తమ స్పీచ్‌లతో అభిమానులని ఖుషి చేశారు. మెగా బ్రదర్ నాగబాబు, స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ మాటల తూటాలు పేల్చారు. మెగా ఫ్యామిలీని విమర్శలతో టార్గెట్ చేసేవారికి ఈ వేదిక ద్వారా సమాధానం చెప్పారు. 
 
ఇక, మెగాస్టార్ చిరంజీవి 9 యేళ్ల రీ-ఎంట్రీ ఇస్తోన్న అదే జోష్, అదే అంకితభావం ఆయన స్వీచ్‌లోనే కనబడింది. మెగాస్టార్ మాటల్లో కాన్ఫిడెన్స్ కనబడింది. ఆయన ప్రసంగంలో ప్రాసతో కూడిన పంచ్ డైలాగులు పేలాయి. అవి ఫంక్షన్‌కి వచ్చిన అభిమానులని ఖుషి చేశాయి.
 
ఇలా అంతా సవ్యంగా సాగిందన్న టైంలో.. చివరి నిమిషంలో మెగా ఈవెంట్‌లో అపశృతి చోటుచేసుకొంది. ఫంక్షన్ పూర్తయి ఇంటికివెళ్లే సమయంలో స్వల్ప తొక్కిసలాట చేసుకొంది. ఈ ఘటనలో దాదాపు 15 మంది మెగా అభిమానులు గాయపడ్డారు. 
 
అయితే, ఈ ప్రమాదంపై నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ... ప్రకృతి వల్ల ఇక్కడ ఓ పెను ప్రమాదం తప్పిందన్నారు. ఎందుకంటే.. ప్రకృతే ఈ స్థలాన్ని తమకు చూపించిందన్నారు. తరలివస్తున్న జనాలను చూస్తుంటే.. ఇదే సరైన వేదికనిపించింది. ఈ సినిమా చూశాక.. గత కెరీర్‌ ఇంకా వుందని.. ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. గత వారం రోజులుగా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాను. 
 
ముందుగా విజయవాడలో జరగాల్సివుంది. కొన్ని కారణావల్ల జరగలేదు. అయితే ఇక్కడివస్తున్న అభిమానుల చూశాక.. ఇక్కడికి షిప్ట్‌ చేయడమే కరెక్ట్‌ అని భావిస్తున్నాం. ప్రకృతే మమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేసింది. ఈరోజు లక్షమందికిపైగా వచ్చే అభిమానులకోసమే కాకుండా.. 10 కోట్ల ప్రలజు టీవీల్లో చూసేట్లగా చేశామని అందుకే ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. 
 

వెబ్దునియా పై చదవండి