అల్లు శిరీస్ 'గౌరవం' చిత్రం ప్లాప్ ఇవ్వడంతో మారుతీతో 'కొత్తజంట' చేశాడు. అది ఓ మోస్తరుగా ఆడింది. 'శ్రీరస్తు శుభమస్తు'తో కాస్త పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆచితూచి అడుగులేస్తూ ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో సినిమా చేస్తున్నాడు. 1971 కాలంలో ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నైపథ్యంలో రూపొందింది. అందుకే ఈ సినిమాకి '1971 బియాండ్ ది బోర్డర్స్' అనే పేరును నిర్ణయించారు.
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మేజర్ రవి డైరెక్ట్ చేసిన ఈ చిత్రమిది. ఇంతకుముందు 'కంచె' షూట్ చేసిన జార్జియాలో చివరి షెడ్యూల్ జరుపుకుంది. శిరీష్ ఒక వార్ ట్యాంకర్ ఆపరేటర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా, సోదరుడు అల్లు అర్జున్ మలయాళీయులకు సుపరిచతమే. తను కూడా ఆ పరిశ్రమలో ఈ చిత్రంతో అడుగుపెట్టనున్నాడు.