సంచలన దర్శకుడు ఆర్జీవి నిత్యం వివాదాలతోనే హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ పలు కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వ్యంగాస్త్రాలు కూడా విసురుతుంటారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, బాలకృష్ణ వంటి స్టార్స్‌పై ఇప్పటికే వ్యంగాస్త్రాలు విసిరిన ఆర్జీవి ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, యువ హీరో అఖిల్‌ను టార్గెట్ చేశారు.