నేను అదృష్టవంతురాలిని అంటోన్న అనూ ఇమ్మాన్యుయేల్

శనివారం, 7 డిశెంబరు 2019 (21:48 IST)
తెలుగు సినిమాల్లో అను ఇమ్మాన్యుయేల్ అడపాదడపా కొన్ని సినిమాలు చేసినా ఆమెకు మంచి విజయాలు లేవు. అన్నీ అపజయాలే. అది కూడా సెకండ్ హీరోయిన్‌గానే ఎక్కువ సినిమాలు చేసింది ఇమ్మాన్యుయేల్. తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసినా అవి కూడా పరాజయం పొందాయి.
 
అయినాసరే పట్టువదలని విక్రమార్కుడిలా ఇమ్మాన్యుయేల్ మాత్రం సినిమాల్లో నటిస్తూనే ఉంది. నిర్మాతలు, దర్సకులు మాత్రం ఆమెకు అవకాశాలు ఇస్తూనే వస్తున్నారు. తాజాగా ఆమె నటించిన నమ్మవీట్టు పిళ్ళె తమిళ సినిమా భారీ విజయాన్ని సాధించింది. తమిళంలో భారీ కలెక్షన్లతో సినిమా విజయవంతంగా ప్రదర్సితమవతోంది.
 
ఆ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌కు మంచి పాత్ర ఇచ్చారు. ఆ పాత్రతో ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది. దీంతో ఇమ్మాన్యుయేల్ ఆనందానికి అవధుల్లేవట. నన్ను కొంతమంది కొన్ని రకాలుగా విమర్సించారు. నేను విన్నాను. అయితే ఈ సినిమాతో నాకు అదృష్టం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇక నేను చేసే సినిమాలన్నీ హిట్ అవుతాయని అనుకుంటున్నానంటోందట ఇమ్మానుయ్యేల్. మరి చూడాలి ఈ అమ్మడు అనుకున్న విధంగా నటించిన సినిమాలన్నీ హిట్ అవుతాయో లేదో. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు