వంటగదిలో చుట్టూ వంట సామానులు, పక్కన పొయ్యి, దానిపై ఏదో వంట చేస్తుంది ఆమని. ఆ పక్కని క్వాటర్ బాటిల్ మద్యం సీసా వుంది. దానిలోంచి స్టీల్‌గ్లాసులో పోసుకుని తాగుతూ, మరో చేతితో గరిట తిప్పుతుంది. ఇలా చేయడం ఆమని ప్రత్యేకత. మరి ఎందుకు అలా చేస్తుందో తెలియాలంటే చావు కబురు చల్లగా సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో ఆమె ఓ పాత్ర పోషించింది. దానికి సంబంధించిన స్టిల్‌ను శనివారంనాడు విడుదల చేశారు. 1990ల్లో మావిచిగురు, శుభలగ్నం లాంటి హోమ్లీ కారెక్టర్స్‌తో అలరించిన ఆమని, `చావు కబురు చల్లగా` సినిమాలో వైవిధ్యమైన పాత్రతో మెప్పించడానికి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఒక చేతిలో మద్యంతాగుతూ మరో చేత్తో వంట చేస్తూ విడుదలైన ఈమె ఫస్ట్ లుక్‌కు విశేషమైన స్పందన వస్తుంది.