ఈ యూత్‌ఫుల్, ఎంగేజింగ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అమరావతిలోని వైకుంటపురం విలేజ్ టెంపుల్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రత్యేక అతిథులతో పాటు చిత్ర తారాగణం, సిబ్బంది పాల్గొన్నారు. ముహూర్తం షాట్‌కు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్లాప్ కొట్టగా, వెన్నా సాంబశివారెడ్డి కెమెరా స్విచాన్ చేశారు.
సుమతీ శతకానికి కథను బండారు నాయుడు అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా హాల్‌స్వామి, ఎడిటర్‌గా సురేష్ విన్నకోట పని చేస్తున్నారు