వరుస ఆఫర్లు కొట్టేస్తూ బాలీవుడ్ భామలకు హీటెక్కిస్తున్న తెలుగు అమ్మాయి (video)

శుక్రవారం, 20 నవంబరు 2020 (20:49 IST)
తెలుగు అమ్మాయి అంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే సినీ అవకాశాలు కష్టమని అంటుంటారు. అటువంటిది ఏకంగా ఓ తెలుగు అమ్మాయి రెండు బాలీవుడ్ ఆఫర్లలో హీరోయిన్‌గా బుక్ అయి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఆశ్చర్యంలో ముంచెత్తిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరంటారా?
అమ్రిన్ ఖురేషి. ఈమె హైదరాబాద్ నివాశి. సినిమాలంటే ప్యాషన్ వున్న అమ్రిన్ ఖురేషికి సునాయాసంగా బాలీవుడ్ ఆఫర్లు వరించాయి. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందుతున్న బ్యాడ్ బాయ్ అనే చిత్రంలో అమ్రిన్ ఖురేషి హీరోయిన్‌గా ఎంపికై అందరికీ షాకిచ్చింది.
ఈ చిత్రం తెలుగులో వచ్చిన సినిమా చూపిస్త మావ సినిమాకి రీమేక్. అలాగే బన్నీ హీరోగా సంచలన విజయం చవిచూసిన జులాయి చిత్రంలో ఇలియానా పోషించిన పాత్రను ఈ అమ్మడు పోషించనుంది. ఇలా వరుసగా రెండు తెలుగు రీమేక్ చిత్రాల్లో అమ్రిన్ ఛాన్సులు కొట్టేయడంపై బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆశ్చర్యపోతున్నారట.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు