యాంకర్ అనసూయ కొత్త వివాదంలో చిక్కుకుంది. ఓ పిల్లాడి ఫోన్‌ను పగులకొట్టిన వ్యవహారం ఆమెను విడిచిపెట్టేలా కనిపించట్లేదు. హైదరాబాద్ నగరంలో తార్నాక సమీపంలో నటి, యాంకర్ అనసూయను చూసిన ఆనందంలో ఓ బాలుడు ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ ఫోనును అనసూయ కోపంతో పగులకొట్టినట్లు బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ వ్యవహారంపై అనసూయ ట్విట్టర్లో స్పందించింది. సెల్ఫీ దిగే పరిస్థితుల్లో తాను లేనని క్లారిటీ ఇచ్చి.. కారులోకి ఎక్కానని.. ఆ పిల్లాడి చేతిలో వున్న ఫోన్ పగిలిందా? లేదా? అనేది తనకు తెలియదని చెప్పింది. అయితే ఓ యువకుడు అనసూయను, హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ.. బాలుడి ఫోన్‌ను ఎందుకు పగులగొట్టావ్? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. ఆ సమయంలో తాను అక్కడే వున్నానని కూడా చెప్పాడు.