ఈమధ్య కాలంలో యాంకర్ అనసూయ, యాంకర్ శ్రీముఖి, యాంకర్ రేష్మిలు ఓ రేంజిలో దూసుకుపోతున్నారు. ఇక సీనియర్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే గత కొంతకాలంగా యాంకరింగుకు దూరంగా వున్న యాంకర్ ఉదయభాను తాజాగా నక్షత్రం ఆడియో వేడుకతో రీఎంట్రీ ఇచ్చింది. ఉదయభాను పలు చిత్రాల్లో నటించడమే కాదు ఐటం గాళ్‌గా కూడా నాట్యం చేసింది.