సరిలేరు నీకెవరూ, సంక్రాంతికి వస్తున్నాం వంటి టైటిల్స్ తెలుగు ప్రేక్షలకు చాలా రీచ్ అయ్యాయి. ఇప్పుడు చక్కటి టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు అలాంటి టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాకు టైటిల్ పరిశీలన మొదలు పెట్టారు. పలు టైటిల్స్ పరిశీలించాక మన శివశంకర ప్రసాద్ అనే టైటిల్ ఎలా వుంటుందనీ, దర్శకుల టీమ్ ను అనిల్ అడిగితే చాలా బాగుందనీ, కథకు కరెక్ట్ గా సరిపోతుందని చెప్పినట్లు సమాచారం.