పునీత్‌తో ఎంట్రీ ఇచ్చాను.. లవ్ యూ సో మచ్ అప్పు సార్.. అనుపమ

శనివారం, 30 అక్టోబరు 2021 (13:44 IST)
Anupama parameshwaran
ఈ ప్రపంచం.. అత్యంత అంకితభావం, ప్రేమ, వినయం, దయగల మనిషిని మిస్ అవుతోంది. మీ చిరునవ్వును ఎలా మరచిపోగలం సార్. నిజంగా గుండె పగిలేలా ఉంది. ఈ నిజాన్ని అంగీకరించలేకకపోతున్నా. లవ్ యూ సో సూ సూ సో సో సో మచ్ అప్పు సార్ అని పోస్ట్ చేసింది అనుపమా పరమేశ్వరన్. ఈ సందర్భంగా తనతో కలసి నటించిన మూవీకి సంబంధించి కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. 
 
మలయాళం ''ప్రేమమ్'' మూవీతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన అనుపమా పరమేశ్వరన్ ఆ తర్వాత దక్షిణాది భాషలన్నింటిలోనూ మెరిసింది. కన్నడలో తన డెబ్యూ మూవీ పునీత్ రాజ్ కుమార్‌తో ''నటసార్వభౌమ''. పునీత్‌తో కన్నడలో ఫస్ట్ మూవీ అనేసరికి అనుపమ ఆనందానికి అవధుల్లేవు. 
 
ఆయన ఎంత పెద్ద స్టారో నాకు తెలుసు.. అలాంటి వ్యక్తితో ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని మురిసిపోయింది. అప్పటికే తెలుగు, తమిళం, మలయాళంలో ప్రేక్షకులను మెప్పించిన అనుపమా... పునీత్ సినిమాతో కన్నడ ప్రేక్షకులకు చేరువైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు