మహిళపై చేసే అఘాయిత్యాలకు ఎంతటి కఠిన శిక్షలు వున్నాయని తెలిసినా కామాంధులు మాత్రం వదిలిపెట్టడంలేదు. చిత్తూరులో సెప్టెంబరు 25న ప్రేమ జంటపై దాడి చేసి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెలా మరో అమ్మాయికి అన్యాయం జరగకూడదని, నిందితులను ఉచ్చువేసి పట్టేసారు. దీనిపై చిత్తూరు పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి.
చిత్తూరు మురకంబట్టు పార్కుకి గత నెల 25న ప్రేమ జంట వచ్చింది. వారిద్దరినీ మహేష్, కిషోర్, హేమంత్ ప్రసాద్ అనే ముగ్గురు కామాంధులు అనుసరించారు. అనంతరం వారు ఏకాంతంగా వున్న సమయంలో వీడియో తీసి వాటిని చూపించి భయపెట్టారు. ఆ తర్వాత వారి వద్ద వున్న డబ్బు, నగలు దోచుకున్నారు. బాలికను మహేష్, కిషోర్ ఇద్దరూ కలిసి సమీపంలో వున్న చెట్ల పొదల్లోకి లాక్కెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం చేసారు. అనంతరం హేమంత్ ప్రసాద్ కూడా బాలికపై అత్యాచారం చేసాడు. ముగ్గురూ దారుణానికి పాల్పడిన తర్వాత తమ గురించి ఎవరికైనా చెబితే తమ వద్ద వున్న వీడియోలను సోషల్ మీడియాలో పెట్టేస్తామంటూ బెదిరించి ఇద్దరినీ వదిలేసారు. ఇదేవిధంగా పలు జంటలపై వీరు అఘాయిత్యాలకు పాల్పడ్డట్లు వారి సెల్ ఫోన్లలో వున్న వీడియోలను బట్టి తెలుస్తోందనీ, కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తాము అని అన్నారు.
సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను చిత్తూరు నడి బజారులో ఊరేగింపుగా రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తీసుకుని వెళ్లారు పోలీసులు. బాలిక తల్లిదండ్రులకు పోలీసులు సూచన చేస్తూ... మీ పిల్లల పట్ల జాగ్రత్తగా వుండాలనీ, వారు ఒంటరిగా ఎక్కడికెళ్తున్నారో గమనించాలని కోరారు.
సెప్టెంబర్ 25న ప్రేమ జంటపై దాడి చేసి మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
సంచలన రేపిన చిత్తూరు మురకంబట్టు పార్కు అత్యాచార ఘటన వివరాలను వెల్లడించిన పోలీసులు.
మహేష్ (A1), కిషోర్ (A2), హేమంత్ ప్రసాద్ (A3)లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.
నిందితులపై పోక్సో చట్టంతో పలు… https://t.co/lR0bqUnWGxpic.twitter.com/ercpUw0KY5
స్వీట్ బేబీ డాటర్ డాల్.. నాతో ఒక రాత్రి గడుపుతావా? అంటూ ఓ విద్యార్థినికి స్వామి చైతన్యానంద వాట్సాప్ సందేశం పంపించాడు. ఇలాగే అనేక మందికి ఆయన వాట్సాప్ సందేశాలు పంపించి లైంగికంగా వేధించినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అలాగే, దుబాయ్ షేక్ కోసం ఓ అమ్మాయిని కావాలంటూ ఓ మహిళకు ఆయన వాట్సాప్‌లో మెసేజ్ పంపించినట్టు తేలింది.
విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టయిన స్వయం ప్రకటిత స్వామీజీ చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. స్వామీజీకి నేరుగా సహకరించారన్న ఆరోపణలపై అతడి ముగ్గురు అత్యంత సన్నిహితురాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ రీసెర్స్‌కు చెందిన అసోసియేట్ డీన్ శ్వేతా శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భావనా కపిల్, సీనియర్ ఫ్యాకల్టీ కాజల్ ఉన్నారు.
ఈ ముగ్గురూ పార్థసారథి ఆదేశాల మేరకే నడుచుకున్నట్లు విచారణలో అంగీకరించారని పోలీసు వర్గాలు తెలిపాయి. క్రమశిక్షణ, సమయపాలన పేరుతో విద్యార్థినులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి, స్వామీజీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నించారని వెల్లడించాయి. అంతేకాకుండా, బాధితులు ఫిర్యాదు చేయకుండా బెదిరించడం, నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేయడంలోనూ వీరి పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించారు.
ఇటీవలే ఆగ్రాలో పట్టుబడిన 62 ఏళ్ల పార్థసారథి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఉపకారవేతనం పథకం కింద మేనేజిమెంట్ కోర్సుల్లో చేరిన 17 మందికి పైగా విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం, బలవంతంగా తాకడం, బెదిరింపులకు పాల్పడటం వంటి ఫిర్యాదులు అందాయి. దర్యాప్తులో భాగంగా ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఉన్న ఒక గెస్ట్‌హౌస్‌ను పోలీసులు పరిశీలించగా, అక్కడ పార్థసారథి విద్యార్థినులతో బస చేసినట్లు స్థానికులు ధ్రువీకరించారు.
నిందితుడి ఫోనులోని డిజిటల్ సాక్ష్యాలను కూడా పోలీసులు సేకరించారు. ఒక యోగా వాట్సాప్ గ్రూపులో విద్యార్థినుల ఫొటోలకు అతడు పెట్టిన అనుచిత వ్యాఖ్యలను గుర్తించారు. ఇన్ని ఆధారాలు దొరికినా, పార్థసారథిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని విచారణ వర్గాలు పేర్కొన్నాయి.